Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ కు కరోనా పాజిటివ్

Junior NTR tested corona positive
  • తనకు కరోనా సోకిందని ఎన్టీఆర్ వెల్లడి
  • ఆందోళన చెందవద్దని ఫ్యాన్స్ కు సూచన
  • ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని వివరణ
  • డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నట్టు ట్వీట్
సెకండ్ వేవ్ లో మరింత ఉగ్రరూపం దాల్చిన కరోనా భూతం ప్రజలను భయకంపితులను చేస్తోంది. తాజాగా టాలీవుడ్ అగ్రహీరో జూనియర్ ఎన్టీఆర్ కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. తనకు కరోనా సోకిందని ఎన్టీఆర్ ట్విట్టర్ లో వెల్లడించారు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని స్పష్టం చేశారు.

తాను, తన కుటుంబం ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నామని, డాక్టర్ల పర్యవేక్షణలో అన్ని మార్గదర్శకాలు పాటిస్తూ చికిత్స పొందుతున్నామని వివరించారు. గత కొన్నిరోజులుగా తనను కలిసిన వారు అప్రమత్తంగా ఉండాలని, కరోనా పరీక్షలు చేయించుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్టీఆర్ సూచించారు.

కాగా, తనకు కరోనా పాజిటివ్ అని జూనియర్ చేసిన ట్వీట్ పై కొద్దిసేపట్లోనే స్పందనలు వెల్లువెత్తాయి. ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు, సినీ ప్రముఖులు సందేశాలు పంపిస్తున్నారు.
Jr NTR
Corona Virus
Positive
Home Isolation
Tollywood

More Telugu News