తన బాడీగార్డ్ కొడుకుని బాలీవుడ్ కి పరిచయం చేస్తున్న సల్మాన్!

10-05-2021 Mon 14:19
  • 26 ఏళ్లుగా సల్మాన్ కు బాడీగార్డ్ గా వ్యవహరిస్తున్న షేరా
  • కరోనా లేకపోతే ఇప్పటికే ప్రకటన వచ్చుండేదన్న షేరా
  • సల్మాన్ ఏది చెపితే అది చేయడమే తనకు తెలుసని వ్యాఖ్య
Salman Kham to inroduce his body guards son to Bollywood

తన సంస్థ 'బీయింగ్ హ్యూమన్' ద్వారా బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఎంతో మందికి సాయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక తన సొంత మనుషులకు సాయం చేయడంలో సల్మాన్ ఏ మాత్రం వెనుకడుగు వేయరు. షేరా అనే వ్యక్తి గత 26 ఏళ్లుగా సల్మాన్ కు బాడీగార్డ్ గా విధులు నిర్వహిస్తున్నాడు. షేరా అంటే సల్మాన్ కు అమితమైన అభిమానం. ఆయన కొడుకును బాలీవుడ్ కు పరిచయం చేస్తానని సల్మాన్ ఎప్పుడో ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారమే షేరా కొడుకు టైగర్ ను తన సొంత బ్యానర్ ద్వారా హీరోగా సల్మాన్ పరిచయం చేయబోతున్నారు.

ఈ అంశంపై షేరా స్పందిస్తూ... కరోనా లేకపోతే తన కొడుకుకు సంబంధించి ఇప్పటికే ప్రకటన వచ్చుండేదని తెలిపాడు. తనకు సల్మాన్ ఏది చెపితే అది చేయడమే తెలుసని చెప్పాడు. సల్మాన్ కుటుంబంతో తనకు ఎంతో అనుబంధం ఉందని తెలిపాడు. సొంత కుటుంబసభ్యుడిగా తనను సల్మాన్ చూస్తారని అన్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన ఈ విషయాలను వెల్లడించారు.