'అటువంటి త‌ప్పు నేను చేయ‌ను'.. త‌న‌ పెళ్లి వార్త‌ల‌పై క్లారిటీ ఇచ్చిన అందాల‌ ఛార్మి!

09-05-2021 Sun 11:41
  • టాలీవుడ్ న‌టి ఛార్మికి పెళ్లి నిశ్చ‌య‌మైంద‌ని వార్త‌లు
  • అవన్నీ వ‌దంతులేన‌న్న ఛార్మి
  • త‌న‌ కెరీర్ హాయిగా సాగిపోతోందని వ్యాఖ్య‌
  • న‌కిలీ రాత‌లు రాసే వారికి, వ‌దంతుల‌కు గుడ్ బై అంటూ ట్వీట్  
charmy on her marriage news

టాలీవుడ్ న‌టి ఛార్మికి పెళ్లి నిశ్చ‌య‌మైంద‌ని, తన సమీప బంధువును ఆమె పెళ్లాడబోతోంద‌ని ఇటీవ‌ల ప్ర‌చారం జ‌రిగింది. గ‌తంలో చాలా సార్లు ఛార్మీ పెళ్లిపై తనకు నమ్మకం లేదని చెప్పిన‌ప్ప‌టికీ ఇటువంటి వార్త‌లు రావ‌డం గ‌మ‌నార్హం. ఛార్మి కుటుంబ స‌భ్యుల నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాక‌పోయిన‌ప్ప‌టికీ ఆమెకు పెళ్ల‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఈ వార్త‌ల‌పై ఛార్మి త‌న‌దైన శైలిలో స్పందించింది.

త‌న పెళ్లి అంటూ వ‌చ్చిన వార్త‌ల్లో నిజం లేదని, అవన్నీవ‌దంతులేన‌ని  ఆమె స్ప‌ష్టం చేసింది. ప్రస్తుతం కెరీర్ హాయిగా సాగిపోతోందని చెప్పింది. ఈ జీవితాన్ని తాను చాలా సంతోషకరంగా గ‌డుపుతున్నాన‌ని తెలిపింది. త‌న‌ జీవితంలో పెళ్లి చేసుకోవడం వంటి తప్పు చేయనని స్ప‌ష్టం చేసింది. అంతేకాదు, న‌కిలీ రాత‌లు రాసే వారికి, వ‌దంతుల‌కు గుడ్ బై అంటూ ఆమె ట్వీట్ చేసింది. అయితే, ఇటువంటి తప్పుడు స్టోరీలతో అంద‌రినీ ఆక‌ర్షిస్తోన్న వారిని అభినందించవచ్చంటూ చుర‌క‌లంటించింది.