Road Accident: హైదరాబాదు శివార్లలో ఘోర రోడ్డు ప్రమాదం... భార్య సహా సీఐ మృతి

Fatal accident at Andullapur Met
  • అబ్దుల్లాపూర్ మెట్ వద్ద ఘటన
  • సూర్యాపేట నుంచి హైదరాబాద్ వస్తున్న సీఐ దంపతులు
  • ఆగివున్న లారీని ఢీకొట్టిన వైనం
  • నుజ్జునుజ్జయిన స్విఫ్ట్ కారు
  • అక్కడికక్కడే మరణించిన సీఐ దంపతులు
హైదరాబాదు సుల్తాన్ బజార్ సీఐ లక్ష్మణ్, ఆయన భార్య ఝాన్సీ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. లక్ష్మణ్, ఝాన్సీ దంపతులు సూర్యాపేట నుంచి హైదరాబాదు వస్తుండగా వేకువజామున ఈ ఘోరం జరిగింది. వీరు ప్రయాణిస్తున్న కారు (స్విఫ్ట్) అబ్దుల్లాపూర్ మెట్ వద్ద రోడ్డుపై ఆగివున్న లారీని బలంగా ఢీకొట్టింది. కారు నుజ్జునుజ్జు కాగా, సీఐ దంపతులు ఘటనస్థలిలోనే ప్రాణాలు కోల్పోయారు. కాగా, ప్రమాదం జరిగిన సమయంలో సీఐ భార్య ఝాన్సీ కారు నడుపుతున్నట్టు తెలిసింది.
Road Accident
CI Laxman
Jhansi
Death
Abdullapur Met
Hyderabad

More Telugu News