Stalin: స్టాలిన్ కేబినెట్లో ఐదుగురు తెలుగువారు... ఎవరంటే..!

  • స్టాలిన్ మంత్రి వర్గంలో 34 మందికి మంత్రులుగా అవకాశం
  • తెలుగువారికి కీలక పదవులను అప్పగించిన స్టాలిన్
  • ఈ ఎన్నికల్లో వివిధ పార్టీల ద్వారా గెలుపొందిన 15 మంది తెలుగువారు
5 Telugu MLAs in Stalin cabinet

తమిళనాడులో ఘన విజయం సాధించిన డీఎంకే పార్టీ ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన స్టాలిన్... 34 మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారు. వీరిలో ఐదుగురు తెలుగువారు ఉండటం గమనార్హం.

గతంలో సీఎంలుగా పనిచేసిన కరుణానిధి, జయలలిత, పళనిస్వామి, పన్నీర్ సెల్వం అందరూ తమ కేబినెట్లో తెలుగువారికి ప్రాతినిధ్యాన్ని కల్పించారు. స్టాలిన్ కూడా అదే ఒరవడిని కొనసాగించారు. తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో తెలుగువారు పెద్ద సంఖ్యలో స్థిరపడ్డారు. అందుకే ఆయా ప్రాంతాల్లో అన్ని పార్టీలు తెలుగువారికి టికెట్లు ఇస్తుంటాయి. తాజా ఎన్నికల్లో 15 మంది తెలుగు వారు వివిధ పార్టీల ద్వారా గెలుపొందారు.

స్టాలిన్ కేబినెట్లో స్థానం దక్కించుకున్న తెలుగువారు వీరే:

  • కేకేఎస్ రామచంద్రన్ - అరుప్పుకొట్టై ఎమ్మెల్యే. కీలకమైన రెవెన్యూ శాఖను దక్కించుకున్నారు.
  • ఏ వేలు - తిరువణ్ణామలై నియోజకవర్గం. పీడబ్ల్యూడీ శాఖ మంత్రిగా నియమితులయ్యారు.
  • ఆర్ గాంధీ - రాణిపేట నియోజకవర్గం. టెక్స్ టైల్ శాఖ మంత్రి.
  • పీకే శేఖర్ బాబు - చెన్నై దురైముగం నియోజకవర్గం. దేవాదాయశాఖ మంత్రి.
  • కేఎన్ నెహ్రూ - తిరుచ్చి వెస్ట్ నియోజకవర్గం. మున్సిపల్ శాఖ మంత్రి.

తెలుగువారందరికీ స్టాలిన్ కీలక శాఖలను అప్పగించడం గమనార్హం. గతంలో బాలకృష్ణారెడ్డి, కదంబురు రాజు వంటి వారు పదేళ్ల పాటు మంత్రులుగా పని చేశారు.

More Telugu News