తెలంగాణలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు

07-05-2021 Fri 20:53
  • గడచిన 24 గంటల్లో 65,375 కరోనా పరీక్షలు
  • 5,559 మందికి పాజిటివ్
  • జీహెచ్ఎంసీ పరిధిలో 984 కొత్త కేసులు
  • రాష్ట్రంలో 41 మంది కరోనాతో మృతి
  • యాక్టివ్ కేసుల సంఖ్య 71,308
Corona cases slow down in Telangana

తెలంగాణలో కరోనా రోజువారీ కేసుల సంఖ్యలో గణనీయంగా తగ్గుదల నమోదవుతోంది. గడచిన 24 గంటల్లో 65,375 కరోనా పరీక్షలు నిర్వహించగా 5,559 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 984 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పలు జిల్లాల్లో రెండంకెల్లోనే కొత్త కేసులు రావడం తాజా బులెటిన్ లో చూడొచ్చు.

అదే సమయంలో 8,061 మంది కరోనా నుంచి కోలుకోగా 41 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 4,87,199కి పెరిగింది. 4,13,225 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 71,308 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 2,666కి చేరింది.

.