మే 31 వరకు ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం... కేంద్రం కీలక నిర్ణయం

Centre orders work from home to govt employees
ప్రభుత్వ ఉద్యోగుల్లోని కొన్ని వర్గాలకు కేంద్రం వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించింది. దేశంలో కొవిడ్ వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్నందున కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దివ్యాంగులైన ఉద్యోగులు, గర్భవతులైన ఉద్యోగులు, కంటైన్మెంట్ జోన్ లో నివసించే అధికారులు, ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే పనిచేసుకోవచ్చని ఓ ప్రకటనలో వెల్లడించింది. మే 31 వరకు ఈ వెసులుబాటు అమల్లో ఉంటుందని కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ తెలిపింది.

అంతకుముందు, ప్రభుత్వ ఉద్యోగుల్లో 50 శాతం మందికి వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించిన కేంద్రం... తాజా ప్రకటన ద్వారా ఆ సదుపాయాన్ని మరింతమందికి అందించింది. ఈ ఉత్తర్వులు వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, గ్రూప్-బి, గ్రూప్-సి ఉద్యోగులకు వర్తిస్తాయి. గ్రూప్-ఏ ఉద్యోగులకు పనిగంటలు తగ్గించారు. ఆఫీసులకు హాజరయ్యే ఉద్యోగులు కరోనా మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని కేంద్రం స్పష్టం చేసింది.
Go Back to Shorts
Work From Home
Govt Employees
Centre
Corona Virus
India

More Telugu News