ఇటలీ షెడ్యూల్ ను పూర్తి చేసిన చైతూ, రాశి ఖన్నా

07-05-2021 Fri 17:17
  • విక్రమ్ కుమార్ తాజా చిత్రంగా 'థ్యాంక్యూ'
  • బీవీఎస్ రవి అందించిన కథ, మాటలు 
  • తమన్ సంగీతం ప్రత్యేక ఆకర్షణ    
Thank You movie shooting completed

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య - రాశి ఖన్నా జంటగా, 'థ్యాంక్యూ' సినిమా రూపొందుతోంది. ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించిన తరువాత, మరికొన్ని కీలకమైన సన్నివేశాల కోసం .. పాటల కోసం ఈ సినిమా టీమ్ కొన్ని రోజుల క్రితం ఇటలీ వెళ్లింది. అక్కడ ప్లాన్ చేసుకున్న తీరుగానే షూటింగు పనులను పూర్తి చేశారట. షూటింగును పూర్తి చేసుకుని తిరిగి బయల్దేరుతున్నట్టుగా ఈ సినిమా టీమ్ వెల్లడించింది.

ఇక్కడికి వచ్చిన తరువాత కరోనా ఉద్ధృతి తగ్గేంత వరకూ విశ్రాంతి తీసుకుని, ఆ తరువాత షెడ్యూల్ ను ప్లాన్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. బీవీఎస్ రవి కథ - మాటలు అందించిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం ఈ సినిమాకి ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన ఈ కథ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకంతో ఉన్నారు. ప్రస్తుతం చైతూ నటించిన 'లవ్ స్టోరీ' రిలీజ్ కి రెడీగా ఉండగా, రాశి ఖన్నా చేతిలో 'పక్కా కమర్షియల్' సినిమా ఉంది.