acb: ఓటుకు నోటు కేసులో విచార‌ణ‌.. స్టీఫెన్ స‌న్ కుమార్తె సాక్ష్యం అవ‌స‌రం లేద‌ని కోర్టుకు తెలిపిన ఏసీబీ

  • అమెరికాలో ఉన్న స్టీఫెన్ స‌న్ కుమార్తె క‌రోనా వేళ రాలేద‌న్న ఏసీబీ
  • స్టీఫెన్ స‌న్ కుమార్తెను సాక్షిగా తొల‌గించేందుకు కోర్టు అంగీకారం  
  • త‌దుప‌రి విచార‌ణ‌ ఈ నెల 10కి వాయిదా  
trail in high court on cash for vote case

హైద‌రాబాద్‌లోని అవినీతి నిరోధ‌క శాఖ న్యాయ‌స్థానంలో 'ఓటుకు నోటు కేసు'లో ఈ రోజు విచార‌ణ జ‌రిగింది. ఈ కేసులో సాక్షులు, క్రాస్ ఎగ్జామినేష‌న్ అంశాల‌పై అవినీతి నిరోధ‌క శాఖ అధికారులు త‌మ అభిప్రాయాలు తెలిపారు. స్టీఫెన్ స‌న్ కుమార్తె సాక్ష్యం అవ‌స‌రం లేద‌ని కోర్టుకు అవినీతి నిరోధ‌క శాఖ అధికారులు తెలియజేశారు.

అమెరికాలో ఉన్న స్టీఫెన్ స‌న్ కుమార్తె క‌రోనా వేళ ఇక్క‌డ‌కు రాలేదని అన్నారు. దీంతో స్టీఫెన్ స‌న్ కుమార్తెను సాక్షిగా తొల‌గించేందుకు అవినీతి నిరోధ‌క శాఖ కోర్టు అంగీకారం తెలిపింది. స్టీఫె‌న్ స‌న్, మాల్కం టేల‌ర్ క్రాస్ ఎగ్జామినేష‌న్ కోసం విచార‌ణను వాయిదా వేసింది. ఈ కేసులో త‌దుప‌రి విచార‌ణ‌ను ఈ నెల 10న జ‌రుపుతామ‌ని తెలిపింది.

కాగా, ఇప్ప‌టికే ఓటుకు నోటు కేసులో సాక్షులు స్టీఫెన్ సన్, ఆయన స్నేహితుడు మాల్కం టేలర్ వాంగ్మూలాలను అధికారులు నమోదు చేసుకున్నారు. కోర్టుకు ఏసీబీ సమర్పించిన వీడియోలు, ఆడియోలు నిజమేనని న్యాయ‌స్థానానికి మే 3న‌ స్టీఫెన్ సన్ తెలిపారు.

ఈ సంద‌ర్భంగా స్టీఫెన్ సన్ కుమార్తె వాంగ్మూలం నమోదు కోసం విచారణను కోర్టు నేటికి వాయిదా వేయ‌డంతో దీనిపైనే ఏసీబీ త‌న అభిప్రాయాల‌ను తెలిపింది. మే 3న కోర్టులో విచారణకు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, ఉదయ్‌సింహా కూడా హాజరయ్యారు.

More Telugu News