Vijayasai Reddy: సీసీఎంబీ ప్రకటన తర్వాత కూడా చంద్రబాబు దుష్ప్రచారం ఆపడం లేదు: విజయసాయిరెడ్డి

Chandrababu is spreading gobels says Vijayasai Reddy
  • ఏపీలో కొత్త కరోనా వైరస్ అంటూ ప్రచారం చేస్తున్నారు
  • హైదరాబాదుకు వెళ్లిపోయినా నారా వైరస్ ఆనవాళ్లు ఏపీలోనే ఉన్నాయి
  • అన్ని ఎన్నికల్లో ప్రజలు ఓడిస్తున్నా చంద్రబాబుకు బుద్ధి రాలేదు
ఏపీలో కొత్త రకం కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోందని, వైరస్ ను కట్డడి చేయడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఎన్440కే వేరియంట్ వైరస్ ప్రబలిందంటూ నారా420 వైరస్ ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. సీసీఎంబీ రిపోర్టు వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు దుష్ప్రచారాన్ని ఆపడం లేదని విమర్శించారు.

హైదరాబాదుకు పారిపోయినా నారా వైరస్ ఆనవాళ్లు మాత్రం ఏపీలో మిగిలిపోయాయని విజయసాయి అన్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్నప్పటికీ వైద్య రంగంలో మౌలిక వసతులను పెంచే విషయాన్ని చంద్రబాబు పట్టించుకోలేదని... అప్పుడే ముందు చూపు ప్రదర్శించి ఉంటే కరోనాను ఎదుర్కోవడం సులువై ఉండేదని చెప్పారు. గత రెండేళ్లుగా జరుగుతున్న ప్రతి ఎన్నికలో టీడీపీని ప్రజలు చిత్తుగా  ఓడిస్తున్నారని... అయినా చంద్రబాబుకు బుద్ధి రాలేదని అన్నారు. రాష్ట్రంలో ఎవరూ ప్రశాంతంగా ఉండకూడదని చంద్రబాబు కోరుకుంటారని చెప్పారు. పైశాచిక ఆనందాన్ని పొందడం తప్ప చంద్రబాబు సాధించేది ఏమీ లేదని అన్నారు.
Vijayasai Reddy
Telugudesam
Chandrababu
YSRCP

More Telugu News