పుంగనూరులో ఆర్టీసీ డిపో... కడపలో ఏరియా ఆసుపత్రి... వర్చువల్ గా ప్రారంభించిన సీఎం జగన్

06-05-2021 Thu 12:50
  • నేడు రెండు ప్రారంభోత్సవాలు
  • తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్
  • సంతోషం వ్యక్తం చేసిన సీఎం జగన్
  • కృతజ్ఞతలు తెలిపిన ఎంపీ మిథున్ రెడ్డి
CM Jagan inaugurates Punganuru RTC depot and area hospital in Kadapa

ఏపీ సీఎం జగన్ ఇవాళ రెండు ప్రారంభోత్సవాలు చేశారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఆర్టీసీ డిపో, కడపలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏరియా ఆసుపత్రిని ఆయన వర్చువల్ విధానంలో ప్రారంభించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కడప ఆర్టీసీ బస్ స్టేషన్ కు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరిట నామకరణం చేశారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, ఆర్టీసీ డిపో, ఆసుపత్రి ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. కాగా, పుంగనూరులో ఆర్టీసీ డిపో ఏర్పాటు ద్వారా ప్రజల కల సాకారమైందని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. అందుకు సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని చెప్పారు.