Nani: నాన్ స్టాప్ గా 'శ్యామ్ సింగ రాయ్' షూటింగ్!

Shyam Singh Roy shooting continues in Covid time
  • విడుదలకు సిద్ధంగా 'టక్ జగదీశ్'
  • ముగింపు దశలో 'శ్యామ్ సింగ రాయ్'
  • కథానాయికలుగా సాయిపల్లవి, కృతి శెట్టి      
లాక్ డౌన్ సమయంలో నిర్మాణంలో ఉన్న సినిమాలన్నీ ఒక్కసారిగా వెనక్కి వచ్చేశాయి. ఆ సమయంలో ఎవరి ఇళ్లలో వాళ్లు కాలక్షేపం చేశారు. లాక్ డౌన్ ఎత్తేయగానే పొలోమంటూ తిరిగి సెట్స్ పైకి వెళ్లిపోయారు. ఆ తరువాత అందరూ ఎవరి సినిమా పనుల్లో వాళ్లు బిజీగా ఉండగా, మళ్లీ కరోనా ఉద్ధృతి పెరిగింది. దాంతో చాలా సినిమాలు షూటింగులు ఆపేసుకున్నాయి. కానీ నాని సినిమా 'శ్యామ్ సింగ రాయ్' మాత్రం నాన్ స్టాప్ గా షూటింగు చేసుకుంటూ వెళ్లడం విశేషం.

రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో 'శ్యామ్ సింగ రాయ్' సినిమా రూపొందుతోంది. హైదరాబాద్ లో ప్రత్యేకంగా వేసిన సెట్లో ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు. నానీతో పాటు ఇతర తారాగణం ఈ షూటింగులో పాల్గొంటోంది. కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న ఈ పరిస్థితుల్లో కూడా షూటింగు కానిచ్చేస్తుండటం విశేషం. భారీ సెట్ లో షూటింగు కావడంతో .. పరిమితమైన సిబ్బందితో .. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ షూట్ చేస్తున్నారు. నాని సరసన సాయిపల్లవి .. కృతి శెట్టి కనిపించనున్నారు. 'టక్ జగదీశ్' తరువాత ఈ సినిమా థియేటర్లకు రానుంది.
Nani
Sai Pallavi
Krithi Shetty
Jagapathi Babu

More Telugu News