Pandu: తమిళ సినీ హాస్యనటుడు పాండు మృతి

Tamil senior comedian Pandu dies of corona
  • ఇటీవల కరోనా బారినపడిన పాండు
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత
  • పాండు భార్యకు కూడా కొవిడ్ పాజిటివ్
  • ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమం 
కరోనా మహమ్మారి కారణంగా మృత్యువాత పడుతున్న ప్రముఖుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా తమిళ సినీ హాస్యనటుడు పాండు కొవిడ్ కు బలయ్యారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో గత కొన్నిరోజులుగా చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఈ ఉదయం ఆయన పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. బాధాకరమైన విషయం ఏమిటంటే పాండు భార్య కూడా కరోనా బారినపడ్డారు. ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఆమె ఆరోగ్యం కూడా క్షీణించింది.

పాండు కమెడియన్ గా ఎన్నో చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటితరం హీరోలతోనూ ఆయన పలు చిత్రాల్లో కనిపించారు. పాండు సోదరుడు సెల్వరాజ్ కూడా నటుడే. పాండు హాస్యనటుడే కాదు, మంచి డిజైనర్ కూడా. అన్నాడీఎంకే పార్టీ రెండాకుల గుర్తును డిజైన్ చేసింది పాండునే. దాంతోపాటు తమిళనాడు టూరిజం లోగోను కూడా ఆయనే రూపొందించారు.  
Pandu
Demise
Corona Virus
Kollywood
Tamilnadu

More Telugu News