వైరస్‌కు అడ్డుకట్ట.. హిమాచల్‌ప్రదేశ్‌లో పది రోజులపాటు లాక్‌డౌన్
- రేపటి నుంచి 16వ తేదీ వరకు లాక్‌డౌన్
- ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల మూసివేత
- ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లోనూ కఠిన ఆంక్షలు
మరోవైపు పశ్చిమ బెంగాల్‌లో నేటి నుంచి కొత్త ఆంక్షలు అమలు కానున్నాయి. మెట్రో రైళ్లు, ఆర్టీసీ బస్సులను 50 శాతం మాత్రమే నడపనున్నారు. నెగటివ్ రిపోర్టు లేకుండా విమానాల ద్వారా బెంగాల్‌లో అడుగుపెట్టే వారు సొంత ఖర్చుపై 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని ప్రభుత్వం తెలిపింది. రెండు వారాలపాటు లోకల్ రైళ్లను నిలిపివేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్‌డౌన్ తరహా ఆంక్షలను ఈ నెల 13 వరకు పొడిగిస్తున్నట్టు ఝార్ఖండ్ ప్రభుత్వం ప్రకటించింది.