'పుష్ప' బడ్జెట్ అంతకంతకూ పెరిగిపోతోందా?

05-05-2021 Wed 17:50
  • కరోనా కారణంగా దెబ్బతింటున్న ప్లాన్
  • పెరిగిపోతున్న ఖర్చులు
  • ఆలోచనలో పడిన నిర్మాతలు
  • ఒకే రోజున 5 భాషల్లో విడుదల  
 Is Pushpa movie budget increasing day by day

సుకుమార్ - బన్నీ కాంబినేషన్లో మూడో సినిమాగా 'పుష్ప' రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. భారీ తారాగణంతో ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. అడవి నేపథ్యంలో సాగే కథ .. అక్కడ షూట్ చేసే యాక్షన్ సీన్స్ .. గూడెం సెట్ .. ఇలా అన్నీ కూడా ఖర్చుతో కూడుకున్నవే. ఇక కరోనా కారణంగా బ్రేక్ ఇవ్వడం .. మళ్లీ మొదలుపెట్టడం .. ఇలా షూటింగు జరుగుతూ పోతోంది. ప్రస్తుతం కూడా షూటింగు ఆగిపోయింది. జూన్ లో మళ్లీ సెట్స్ పైకి వెళదామనే ఆలోచనలో ఉన్నారట.

ఇలా ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం షూటింగు జరక్కపోవడంతో, ఖర్చు పెరిగిపోతూ వస్తోందట. ఇంతవరకూ 35 కోట్లు ఖర్చు చేశారట. పరిస్థితులలో వచ్చిన మార్పు కారణంగా, ఇక నుంచి ఖర్చు తగ్గించుకుంటూ వెళ్లాలనే ఆలోచనకి నిర్మాతలు వచ్చారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ విషయాన్ని సుకుమార్ చెవిన కూడా వేశారట. ఆయన ఎలా స్పందించాడనేది తెలియదు. ఇక, ఒకేసారి తెలుగుతో పాటుగా తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఉద్దేశంతో నిర్మాతలు ఉన్నారు.