Jagapati babu: కళ్ల ముందే ఎంతో మంది చనిపోతున్నారు: జగపతిబాబు

So many people are dying with corona says Jagapati Babu
  • కరోనాతో మృతి చెందిన అభిమాన సంఘం ప్రెసిడెంట్
  • జీర్ణించుకోలేకపోతున్నానన్న జగపతి
  • అందరూ కొవిడ్ ప్రొటోకాల్ పాటించాలని వినతి
కరోనా వల్ల ఎంతో మంది కళ్ల ముందే కన్ను మూస్తున్నారని ప్రముఖ సినీ నటుడు జగపతిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తన అభిమానసంఘం ప్రెసిడెంట్ గా ఉన్న శ్రీను కరోనా బారిన పడి నిన్న చనిపోయిన విషయం తెలుసుకుని ఆయన కదిలిపోయారు. ఈ వార్తను జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పారు.

మనం చూస్తుండగానే కరోనా ఎందరినో బలితీసుకుంటోందని అన్నారు. ఇంకెంతమందిని బలితీసుకుంటుందో తెలియని పరిస్థితి ఉందని చెప్పారు. ప్రతి ఒక్కరూ కొవిడ్ ప్రొటోకాల్ పాటించాలని, మాస్కులు ధరించాలని, శానిటైజర్లు వాడాలని అన్నారు. శ్రీను మృతి బాధాకరమని... ఆయన కుటుంబానికి తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నానని చెప్పారు. శ్రీను తన  సంతానంలో ఒకరికి జగపతి అనే పేరు పెట్టుకున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
Jagapati babu
Tollywood

More Telugu News