Pooja Hegde: మొత్తానికి కరోనాను తరిమికొట్టా: టాలీవుడ్ నటి పూజ హెగ్డే

Pooja Hegde finally recovered from corona virus
  • ఇటీవల కరోనా బారినపడిన పూజ 
  • పుస్తకాలు చదువుతూ, యోగాసనాలు వేస్తూ గడిపేసిన బుట్టబొమ్మ
  • మొత్తానికి కరోనా నుంచి బయటపడ్డానన్న నటి
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజ హెగ్డే కరోనా నుంచి కోలుకుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా స్వయంగా వెల్లడించింది. కరోనా నుంచి తాను పూర్తిగా కోలుకున్నానని, కరోనాను తన్నితరిమేశానని పేర్కొంది. తాజాగా చేయించుకున్న పరీక్షల్లో నెగటివ్ రిపోర్టులు వచ్చినట్టు తెలిపింది. మీ అందరి ఆదరాభిమానాలు, విషెస్‌‌తో తాను త్వరగా కోలుకోగలిగానని వివరించింది. ఈ సందర్భంగా తన యోగక్షేమాలు కాంక్షించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపింది.

కాగా, ఇంతకాలం క్వారంటైన్‌లో ఉన్న పూజ జాలీగా గడిపింది. కరోనా సమయంలో ఉపయోగపడతాయంటూ కొన్ని యోగాసనాలను షేర్ చేసింది. క్వారంటైన్ కాలాన్ని పుస్తకాలు చదివేందుకు వినియోగిస్తున్నట్టు చెప్పింది. పూజ ప్రస్తుతం తెలుగులో 'మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్', 'ఆచార్య', 'రాధేశ్యామ్' వంటి చిత్రాల్లో నటిస్తోంది.
Pooja Hegde
Corona Virus
Tollywood

More Telugu News