'పుష్ప' టీజర్ ఆల్ టైమ్ రికార్డ్

04-05-2021 Tue 19:09
  • స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథ
  • టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్స్
  • ఫారెస్టు యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్  

Fastest record for Pushpa teaser in youtube

అల్లు అర్జున్ కథానాయకుడిగా 'పుష్ప' సినిమా రూపొందుతోంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో, కథానాయికగా రష్మిక నటిస్తోంది. ఇప్పటికే కొన్ని కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. ఇటీవలే అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను వదిలారు. యూ ట్యూబ్ లో వదిలిన క్షణం నుంచి ఈ టీజర్ రాకెట్ వేగంతో దూసుకుపోతోంది. చాలా తక్కువ సమయంలోనే 50 మిలియన్ వ్యూస్ ను .. 1 మిలియన్ లైక్స్ ను సాధించి 'ఔరా' అనిపించింది.

ఇక ఇప్పుడు 60 మిలియన్ వ్యూస్ ను .. 1.4 మిలియన్ లైక్స్ ను రాబట్టి ఆల్ టైమ్ రికార్డును సృష్టించింది. ఇంతవరకూ తెలుగులో ఒక టీజర్ కి ఈ స్థాయి వ్యూస్ .. లైక్స్ రావడం ఇదే మొదటిసారి. బన్నీ ఖాతాలో ఈ రికార్డు చేరడంతో ఆయన అభిమానులంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఫారెస్టులోని యాక్షన్ సీన్స్ ..  ఊర్వశీ రౌతేలా ఐటమ్ సాంగ్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు.