Curfew: ఏపీలో రేపటి నుంచి కర్ఫ్యూ... మధ్యాహ్నం 12 గంటల తర్వాత నిలిచిపోనున్న ప్రజా రవాణా వాహనాలు

  • ఏపీ క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు
  • రేపటి నుంచి రాష్ట్రంలో కర్ఫ్యూ అమలుకు ఆమోదం
  • మధ్యాహ్నం 12 తర్వాత కర్ఫ్యూ
  • నిలిచిపోనున్న ఆర్టీసీ, అంతర్రాష్ట్ర సర్వీసులు
Curfew will be imposed in AP from tomorrow

సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత కర్ఫ్యూ అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రజా కార్యకలాపాలకు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే అనుమతించాలని నిర్ణయించారు.

మధ్యాహ్నం 12 గంటల తర్వాత ప్రజా రవాణా వాహనాలను కూడా నిలిపివేయాలని నిర్ణయించారు. దాంతో మధ్యాహ్నం నుంచి ఏపీఎస్ఆర్టీసీ బస్సులతో పాటు, అంతర్రాష్ట్ర సర్వీసులు కూడా నిలిచిపోనున్నాయి.

More Telugu News