బెంగాల్ హింసాకాండలో 12 మంది మృతి.. ప్రశాంతంగా ఉండాలని కోరిన మమత!
- ఎన్నికల ఫలితాల తర్వాత బెంగాల్ లో హింసాత్మక ఘటనలు
- శాంతిని ప్రేమించే రాష్ట్రం బెంగాల్ అన్న మమత
- హింసాత్మక ఘటనల్లో ఎవరూ పాల్గొనొద్దని సూచన
మరోవైపు మమత వ్యాఖ్యలపై రాష్ట్ర బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ స్పందిస్తూ... అందరూ ప్రశాంతంగా ఉండాలని మమత కోరడం మంచి పరిణామమని అన్నారు. రాష్ట్రంలో హింస చల్లారకపోతే తాము ధర్నాలు, నిరసన కార్యక్రమాలను చేపట్టాల్సి వస్తుందని చెప్పారు. విజయం సాధించిన తర్వాత కూడా టీఎంసీ హింసకు పాల్పడటం దారుణమని అన్నారు. ఎందరో ప్రాణాలు కోల్పోయారని దాదాపు వెయ్యి గృహాలు, కార్యాలయాలు ధ్వంసమయ్యాయని మండిపడ్డారు.