తెలంగాణలో మరో 6,876 మందికి కరోనా పాజిటివ్

04-05-2021 Tue 11:01
  • రాష్ట్రంలో నిదానించిన కరోనా
  • గత 24 గంటల్లో 70,961 కరోనా పరీక్షలు
  • అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,029 కేసులు
  • రాష్ట్రంలో మరో 59 మంది మృతి
  • యాక్టివ్ కేసుల సంఖ్య 79,520
Telangana corona bulletin

తెలంగాణలో కరోనా వ్యాప్తి కాస్త అదుపులోకి వస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 70,961 కరోనా పరీక్షలు నిర్వహించగా 6,876 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో 1,029 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 7,432 మంది కరోనా నుంచి కోలుకోగా, 59 మంది మరణించారు. దాంతో తెలంగాణలో కరోనా మృతుల సంఖ్య 2,476కి పెరిగింది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 4,63,361 పాజిటివ్ కేసులు నమోదు కాగా 3,81,365 మంది కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 79,520 మందికి కరోనా చికిత్స కొనసాగుతోంది.