తిరుమలలో 8 వేలకు పడిపోయిన భక్తుల సంఖ్య!

04-05-2021 Tue 09:43
  • దారుణంగా పడిపోయిన రద్దీ
  • నిన్న 8,292 మందికి స్వామి దర్శనం
  • రూ. 55 లక్షలకు పడిపోయిన హుండీ ఆదాయం
Very Low Rush in Tirumala

తిరుమలలో భక్తుల రద్దీ దారుణంగా పడిపోయింది. టికెట్లు బుక్ చేసుకున్న వారు కూడా స్వామి దర్శనానికి రాకపోవడంతో ఏ మాత్రమూ భక్తులు కనిపించడం లేదు. నిన్న సోమవారం నాడు 8,292 మంది భక్తులు మాత్రమే స్వామిని దర్శించుకున్నారు.

ఇదే సమయంలో 4,688 మంది తలనీలాలు సమర్పించగా, హుండీ ద్వారా రూ. 55 లక్షల ఆదాయం లభించిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. కాగా, తిరుమలలో ఈ ఉదయం అగ్నిప్రమాదం జరుగగా, రూ. 10 లక్షల వరకూ ఆస్తినష్టం సంభవించిందని అధికారులు తెలిపారు.