2011 నాటి ఆ ఘటనను ఎన్నడూ మరచిపోలేను: జో బైడెన్!

04-05-2021 Tue 08:38
  • పదేళ్ల క్రితం లాడెన్ ను మట్టుబెట్టిన యూఎస్
  • లాడెన్ కు పడాల్సిన శిక్ష కాస్త ఆలస్యమైంది
  • యూఎస్ ఆపరేషన్ ను గుర్తు చేసుకున్న బైడెన్
Cant Forget That Incident says Biden

అమెరికా ఆర్థిక వ్యవస్థపై దాడికి కుట్ర చేయడం ద్వారా ప్రపంచాన్ని వణికించిన అల్ ఖైదా ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ ను అమెరికా మట్టుబెట్టి, పది సంవత్సరాలు అవుతుండగా, నాటి ఘటనను ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ గుర్తు చేసుకున్నారు. నాటి ఘటనను తాను ఎప్పటికీ మరచిపోబోనని అన్నారు. అంతకు ఎన్నో ఏళ్లకు ముందే వేయాల్సిన శిక్షను ఆ రోజు వేశామని అన్నారు. ఆపై ఆఫ్ఘనిస్థాన్ లో కొనసాగుతున్న అంతర్యుద్ధానికి తెరదించే ప్రయత్నాలను ప్రారంభించామని బైడెన్ అన్నారు.

కాగా, పాకిస్థాన్ లో లాడెన్ తలదాచుకున్నాడని గుర్తించిన అప్పటి యూఎస్ ప్రభుత్వం, స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి, లాడెన్ ను హతమార్చిన సంగతి తెలిసిందే.