మాజీ ఎంపీ సబ్బం హరి మృతికి సంతాపం తెలిపిన సీఎం జగన్

03-05-2021 Mon 21:54
  • కరోనాతో సబ్బం హరి కన్నుమూత
  • కరోనాతో పోరులో ఓడిపోయిన నేత
  • విచారం వ్యక్తం చేసిన సీఎం జగన్
  • సబ్బం హరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి
CM Jagan conveys condolences to Sabbam Hari demise

మాజీ ఎంపీ సబ్బం హరి మృతి పట్ల సీఎం జగన్ స్పందించారు. కరోనాతో బాధపడుతున్న సబ్బం హరి చికిత్స పొందుతూ ఈ మధ్యాహ్నం కన్నుమూశారు. దీనిపై సీఎం జగన్ విచారం వ్యక్తం చేశారు. సబ్బం హరి మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

అటు, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందించారు. మాజీ ఎంపీ సబ్బం హరి ఆకస్మిక మరణం విచారకరం అని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలియజేస్తున్నానని వివరించారు. సబ్బం హరి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు.