ముఖ్యమంత్రిగా స్టాలిన్ ప్రమాణస్వీకారం చేయబోయేది ఎప్పుడంటే...?

03-05-2021 Mon 16:37
  • తమిళనాడులో ఘన విజయం సాధించిన డీఎంకే
  • 7వ తేదీన సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న స్టాలిన్
  • సీఎం పదవికి రాజీనామా చేసిన పళనిస్వామి
Stalin is going to take oath as CM on 7 of this month

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత స్టాలిన్ తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టబోతున్నారు. ప్రమాణస్వీకారానికి కావాల్సిన ఏర్పాట్లు అప్పుడే మొదలయ్యాయి. ఈ నెల 7వ తేదీన స్టాలిన్ సీఎంగా ప్రమాణం చేయనున్నారు. అయితే, కరోనా పంజా విసురుతున్న తరుణంలో నిరాడంబరంగా ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహించాలని స్టాలిన్ నిర్ణయించారు.

మరోవైపు డీఎంకే ఘన విజయం సాధించిన వెంటనే స్టాలిన్ చెన్నైలోని మెరీనా బీచ్ వద్ద ఉన్న తన తండ్రి కరుణానిధి స్మారకం వద్దకు వెళ్లి, నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కరోనా నిబంధనలకు అనుగుణంగానే అతికొద్ది మంది సమక్షంలో ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని జరుపుతామని చెప్పారు. మరోవైపు, ప్రస్తుత ముఖ్యమంత్రి పళనిస్వామి తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ కు ఈరోజు పంపించారు.