సబ్బం హరి ఇక లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నా: నారా లోకేశ్

03-05-2021 Mon 16:27
  • కరోనాకు బలైన సబ్బం హరి
  • టీడీపీ వర్గాల్లో విషాదం
  • తీవ్ర విచారం వ్యక్తం చేసిన లోకేశ్
  • నిస్వార్థ రాజకీయ నేత అని కితాబు
  • తమకు మార్గదర్శి అని వెల్లడి
Nara Lokesh comments on Sabbam Hari demise

టీడీపీ నేత, మాజీ ఎంపీ సబ్బం హరి కరోనాతో కన్నుమూయడం పట్ల పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సబ్బం హరి ఇక లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని వ్యాఖ్యానించారు. సబ్బం హరి తన నిస్వార్థ రాజకీయాలతో తమ వంటి వారందరికీ మార్గదర్శకులుగా నిలిచారని కొనియాడారు. సబ్బం హరి వంటి నేతను కోల్పోవడం నిజంగా దురదృష్టకరమని పేర్కొన్నారు.

ఏ అంశంపై అయినా సబ్బం హరి తన అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పేవారని, ప్రజాసమస్యలపై రాజీ లేని పోరాటం చేశారని లోకేశ్ కీర్తించారు. సబ్బం హరి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నానని స్పందించారు.