Rains: హైదరాబాదులో ఈదురుగాలులతో భారీ వర్షం... విరిగిపడిన చెట్లు, స్తంభాలు

  • హైదరాబాదులో మారిన వాతావరణం
  • ఒక్కసారిగా ఆకాశం మేఘావృతం
  • పలు ప్రాంతాల్లో వర్షపాతం నమోదు
  • లోతట్టు ప్రాంతాలు జలమయం
  • డిజాస్టర్ బృందాలను అప్రమత్తం చేసిన జీహెచ్ఎంసీ కమిషనర్
huge rain in hyderabad

హైదరాబాద్ లో ఈదురుగాలుతో భారీ వర్షం కురిసింది. ఆకాశం ఒక్కసారిగా మేఘావృతం కాగా, ఉరుములు, మెరుపులతో వర్షపాతం నమోదైంది. బేగంబజార్, నాంపల్లి, అబిడ్స్, లక్డీకాపూల్, నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతినగర్ ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. కూకట్ పల్లి, మణికొండ, సిద్ధప్ప బస్తీ, గచ్చిబౌలి, మాదాపూర్, ఫిలింనగర్, హైటెక్ సిటీలో వర్షపాతం నమోదు కాగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మెహదీపట్నం, మాసాబ్ ట్యాంక్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లోనూ వరుణుడి ఉద్ధృతి కనిపించింది.

ఈదురుగాలుల ధాటికి పలు ప్రాంతాల్లో చెట్లు, స్తంభాలు విరిగిపడ్డాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ బృందాలను అప్రమత్తం చేశారు. జోనల్ కమిషనర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు.

More Telugu News