15 రోజుల కాలానికి ఏపీకి 9,17,850 వ్యాక్సిన్ డోసుల కేటాయింపు: సోము వీర్రాజు

02-05-2021 Sun 12:35
  • ఏపీకి రోజుకు 470 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్
  • 73 వేల డోసుల రెమిడెసివర్ ఇంజెక్షన్లు
  • ప్రజలందరి సహకారంతో కరోనాను జయించటానికి కృషి చేస్తాము
9 lask doses for ap says somu veerraju

క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం అన్ని చ‌ర్య‌లు తీసుకుంటోంద‌ని, ఆక్సిజ‌న్, ఔష‌ధాలు, వ్యాక్సిన్ల కేటాయింపులు చేస్తోంద‌ని బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు చెప్పారు. ఏపీకి కేంద్ర స‌ర్కారు వాట‌న్నింటినీ స‌ర‌ఫ‌రా చేస్తోంద‌ని వివ‌రిస్తూ ట్వీట్లు చేశారు.

'కొవిడ్ రక్షణ చర్యలలో భాగంగా రాష్ట్రానికి రోజుకు 470 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను, 73 వేల డోసుల రెమిడెసివర్ ఇంజెక్షన్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. అలాగే మే నెల తొలి 15 రోజుల కాలానికి రాష్ట్రానికి 9,17,850 వ్యాక్సిన్ డోసులను కేటాయించడం జరిగింది' అని సోము వీర్రాజు చెప్పారు.

'పరిస్థితులను బట్టి మరింత ఎక్కువగా వ్యాక్సిన్ల కేటాయింపులను జరిపి వీలయినంత త్వరగా ప్రజలందరి సహకారంతో కరోనాను జయించటానికి కృషి చేస్తాము' అని సోము వీర్రాజు తెలిపారు.