Panabaka Lakshmi: తిరుప‌తి టీడీపీ అభ్య‌ర్థి అసంతృప్తితో కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన‌ట్లు ప్ర‌చారం.. స్పందించిన ప‌న‌బాక ల‌క్ష్మి

panabaka lakshmi slams govt
  • ఆ ప్ర‌చారాన్ని ఖండించిన‌ ప‌న‌బాక లక్ష్మి
  • ఏపీలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరగ‌లేద‌ని విమ‌ర్శ‌
  • ప్రజాస్వామ్య‌యుతంగా జ‌రిగితే ఫలితాలు వేరేగా ఉండేవ‌ని వ్యాఖ్య  
తిరుపతి లోక్‌స‌భ ఉప ఎన్నిక ఫ‌లితాల్లో వైసీపీ అభ్య‌ర్థి గురుమూర్తి 94,307 ఓట్లతో ఆధిక్యంలో కొన‌సాగుతున్నారు. టీడీపీ అభ్య‌ర్థి  అభ్యర్థి పనబాక లక్ష్మి  రెండో స్థానంలో కొన‌సాగుతున్నారు. అయితే, ఈ ఫ‌లితాలను చూసి అసంతృప్తితో కౌంటింగ్ కేంద్రం నుంచి ఆమె వెళ్లిపోయినట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆ ప్ర‌చారాన్ని ప‌న‌బాక లక్ష్మి ఖండించారు.

అటువంటి ఘ‌ట‌న జ‌ర‌గ‌లేద‌ని చెప్పారు. అయితే, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే ఫలితం కూడా అందుకు త‌గ్గ‌ట్లు ఉండేవ‌ని చెప్పారు. ఫలితాల గురించి ముందే తెలిసి కూడా అక్కడ జ‌రుగుతున్న‌ తమాషా చూద్దామనే కౌంటింగ్ కేంద్రం వ‌ద్ద‌కు వ‌చ్చాన‌ని చుర‌క‌లంటించారు.

Panabaka Lakshmi
Telugudesam
YSRCP

More Telugu News