ఆక్సిజన్ అందక.. బెడ్డు దొరక్క.. కారులోనే పోయిన ప్రాణాలు!
- నోయిడాలో దారుణ ఘటన
- 35 ఏళ్ల ఇంజనీర్ మృత్యువాత
- మూడు గంటల పాటు నరకయాతన
- మధ్యప్రదేశ్ లో ఉంటున్న భర్త, పిల్లలు
ఆమె సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్. ఆమె భర్త పిల్లలు సొంత రాష్ట్రంలోనే ఉంటుండగా.. వృత్తి రీత్యా ఇంజనీర్ అయిన ఆమె నోయిడాలో ఉద్యోగం చేస్తున్నారు. అయితే, కరోనా సోకి తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆమె యజమాని ఆసుపత్రికి తీసుకొచ్చారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. స్పృహ తప్పి పడిపోయిన తర్వాతే వైద్యులు వచ్చి చూశారని, అప్పటికే ఆమె చనిపోయిందని పేర్కొన్నారు.