మా లోకేశ్‌ విద్యార్హతల గురించి పదేపదే ప్రశ్నిస్తావ్.. అసలు మీ నాయకుడు ఏమి చదివాడు?: వ‌ర్ల రామ‌య్య

01-05-2021 Sat 13:09
  • విజయసాయిరెడ్డి గారు మీ ఆలోచనలకు అసలు సిగ్గు లేదు
  • ఒకటి అని, పది అనిపించుకుంటారు
  • మీ నాయ‌కుడు ఏ విద్యాలయంలో చదివాడు
  • చివరిగా అయన సాధించిన డిగ్రీ ఏమిటో చెప్పగలరా?  
varla slams vijay sai reddy

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత వ‌ర్ల రామ‌య్య విమ‌ర్శ‌లు గుప్పించారు. టీడీపీ యువ‌నేత‌ లోకేశ్ విద్యార్హ‌త‌ల గురించి ప్ర‌శ్నిస్తోన్న విజ‌య‌సాయిరెడ్డి... సీఎం జ‌గ‌న్ విద్యార్హ‌త‌ల గురించి చెప్పాల‌ని ఆయ‌న నిల‌దీశారు.

'విజయసాయిరెడ్డి గారు, మీ ఆలోచనలకు  అసలు సిగ్గు లేదు. ఒకటి అని, పది అనిపించుకుంటారు. ఏమి జన్మరా బాబు? మా లోకేశ్‌ విద్యార్హతల గురించి పదేపదే ప్రశ్నిస్తావ్. అసలు మీ నాయకుడు ఏమి చదివాడు, ఏ విద్యాలయంలో చదివాడు, ఏయే సంవత్సరం ఏ స్కూల్లో చదివాడు, చివరిగా అయన సాధించిన డిగ్రీ ఏమిటో చెప్పగలరా?' అని వ‌ర్ల రామ‌య్య ప్ర‌శ్నించారు.