KL Rahul: రాణించిన కేఎల్ రాహుల్, గేల్... భారీ స్కోరు సాధించిన పంజాబ్ కింగ్స్

  • బెంగళూరు వర్సెస్ పంజాబ్
  • మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్
  • 20 ఓవర్లలో 5 వికెట్లకు 179
  • 91 పరుగులతో అజేయంగా నిలిచిన కేఎల్ రాహుల్
  • గేల్ మెరుపు ఇన్నింగ్స్
Punjab Kings posted huge score against Royal Challengers Banglore

కెప్టెన్ కేఎల్ రాహుల్ బాధ్యతాయుతంగా ఆడిన వేళ పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు నమోదు చేసింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుపై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 179 పరుగులు చేసింది. మొత్తం 57 బంతులెదుర్కొన్న కేఎల్ రాహుల్ 7 ఫోర్లు, 5 సిక్సులతో 91 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. విధ్వంసక ఆటగాడు క్రిస్ గేల్ 24 బంతుల్లోనే 6 ఫోర్లు, 2 సిక్సులతో 46 పరుగులు సాధించడం విశేషం. చివర్లో హర్ ప్రీత్ బ్రార్ చకచకా 25 పరుగులు చేసి భారీ స్కోరు సాధనలో తన వంతు పాత్ర పోషించాడు.

వాస్తవానికి పంజాబ్ కింగ్స్ ఊపు చూస్తే స్కోరు 200 దాటుతుందని అనిపించింది. కేఎల్ రాహుల్, గేల్ ఆడుతున్నంత సేపు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు బెంబేలెత్తిపోయారు. గేల్ అవుట్ కావడంతో స్కోరు మందగించింది. ఓవైపు రాహుల్ తన వికెట్ కాపాడుకుంటూనే స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. చివరి ఓవర్లో రాహుల్, బ్రార్ జోడీ 22 పరుగులు సాధించింది.

ఓపెనర్ గా దిగిన ప్రభ్ సిమ్రన్ 7 పరుగులకే అవుట్ కాగా, నికోలాస్ పూరన్ (0) మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. పూరన్ డకౌట్ కావడం ఈ ఐపీఎల్ సీజన్ లో నాలుగోసారి. దీపక్ హుడా (5), షారుఖ్ ఖాన్ (0) కూడా విఫలమయ్యారు. బెంగళూరు బౌలర్లలో కైల్ జేమీసన్ 2, డేనియల్ సామ్స్ 1, చహల్ 1, షాబాజ్ అహ్మద్ 1 వికెట్ తీశారు.

More Telugu News