మల్టీస్టారర్ మూవీలో డిఫరెంట్ రోల్ చేస్తున్న రావు రమేశ్!

30-04-2021 Fri 17:50
  • విలక్షణ నటుడిగా గుర్తింపు
  • వరుస సినిమాలతో బిజీ
  • డైలాగ్ విరుపులో ప్రత్యేకత  

Rao Ramesh is duing a different role in Mahasamudram movie

రావు రమేశ్ .. పరిచయమే అవసరం లేని పేరు. విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలకు ఆయన కేరాఫ్ అడ్రెస్. రావు రమేశ్ డైలాగ్ డెలివరీని ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడతారు. అక్షరాలను అవసరమైన చోట ఆయన దువ్వేసి వదులుతూ ఉంటారు. అలా ఆయన డైలాగ్ పలికే తీరును ఎందరో ఇష్టపడుతూ ఉంటారు. కాస్త కామెడీ .. మరికాస్త వెటకారం .. ఇంకాస్త విలనిజం ఉన్న పాత్రలను పండించడంలో ఆయన సిద్ధహస్తుడు. అలాంటి ఆయన వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఆయన లేని సినిమాలు చాలా తక్కువ.

ప్రస్తుతం రావు రమేశ్ చేస్తున్న సినిమాల జాబితాలో 'మహాసముద్రం' ఒకటి. శర్వానంద్ - సిద్ధార్థ్ కథానాయకులుగా నటిస్తున్నఈ సినిమాలో, అదితీరావు - అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా కనువిందు చేయనున్నారు. ఈ సినిమాలో రావు రమేశ్ ఒక కీలకమైన పాత్రను చేస్తున్నాడట. ఈ పాత్రలో ఆయన నెగెటివ్ షేడ్స్ కలిగిన గూనివాడిగా కనిపిస్తూనే చక్రం తిప్పుతాడట. ఆయన కెరియర్లో చేసిన ప్రత్యేకమైన పాత్రల వరుసలో ఈ పాత్ర కూడా చేరుతుందని అంటున్నారు. మహాసముద్రాన్ని అల్లకల్లోలం చేసేది ఈ పాత్రేనన్నమాట!