Amaravati Employees JAC: ఉద్యోగులు చనిపోతున్నారు... ఇప్పటికైనా వర్క్ ఫ్రం హోం కల్పించాలి: అమరావతి ఉద్యోగుల జేఏసీ డిమాండ్

Amaravati Employees JAC asks govt ensure work from home
  • ఏపీ సచివాలయంలో కరోనా మృత్యుఘంటికలు
  • ఇప్పటివరకు 8 మంది చనిపోయారన్న బొప్పరాజు
  • ఉద్యోగుల్లో ప్రభుత్వం భరోసా కల్పించాలని విజ్ఞప్తి
  • కరోనా సోకిన ఉద్యోగులకు వేతన సెలవు ఇవ్వాలని వినతి
  • ఆసుపత్రుల్లో ప్రత్యేక సదుపాయం కల్పించాలని వెల్లడి
కొవిడ్ బారినపడి ఏపీ సచివాలయంలోనూ పలువురు ఉద్యోగులు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. పదుల సంఖ్యలో ఉద్యోగులకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీనిపై అమరావతి ఉద్యోగుల జేఏసీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. కరోనా కారణంగా ఉద్యోగులు చనిపోతున్నారని, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వర్క్ ఫ్రం హోం సదుపాయం ఇవ్వాలని జేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు.

సచివాలయంలో 8 మంది ఉద్యోగులు కరోనాకు బలయ్యారని వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో ఉద్యోగుల్లో భరోసా కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. కరోనా సోకిన ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని కోరారు. కరోనా పాజిటివ్ ఉద్యోగులకు ఆసుపత్రుల్లో ప్రత్యేక సదుపాయం కల్పించాలని అన్నారు.
Amaravati Employees JAC
Bopparaju
Work From Home
AP Secretariat
Corona Pandemic
Deaths

More Telugu News