'పిల్లా.. జెల్లా.. ఐసోల్లు.. ముసలోల్లు ఫోన్‌ల నా పెండ్లిసూడుర్రి'.. మై విలేజ్ షో ఫేం అనిల్ జీల శుభ‌లేఖ‌ వైర‌ల్

30-04-2021 Fri 12:11
  • త్వ‌ర‌లో అనిల్ జీల పెళ్లి
  • వెరైటీగా శుభ‌లేఖ‌
  • ఆన్‌లైన్‌లో పెళ్లిచూడాల‌ని విజ్ఞ‌ప్తి
anil jeela wedding card goes viral

'పిల్లా.. జెల్లా.. ఐసోల్లు.. ముసలోల్లు ఫోన్‌ల నా పెండ్లిసూడుర్రి' అంటూ మై విలేజ్ షో ఫేం అనిల్ జీల ఓ పోస్ట్ చేశాడు. గంగ‌వ్వ న‌టించే మై విలేజ్ షో యూట్యూబ్ చానెల్ బాగా పాప్యుల‌ర్ అయిన విష‌యం తెలిసిందే. ఇందులో అనిల్ కూడా ఉంటాడు. క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో ఎవ్వ‌రినీ పిల‌వ‌కుండా పెళ్లి చేసుకోవాల్సిన ప‌రిస్థితులు రావ‌డంతో అనిల్ కూడా కొద్ది మంది సమ‌క్షంలోనే వివాహ వేడుక జ‌రుపుకుంటున్నాడు.

అయితే, ఆన్‌లైన్‌లో మాత్రం అంద‌రూ చూడొచ్చ‌ని చెబుతున్నాడు. తెలంగాణ యాస‌లో ఆయ‌న పెళ్లి ప‌త్రిక‌ను పోస్ట్ చేశాడు.  శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు అని ప‌త్రిక‌లో రాయ‌కుండా శానిటైజర్ ఫస్టు.. మాస్క్ మస్టు.. సోషల్ డిస్టెన్స్ బెస్టు అని రాసుకొచ్చాడు. వ‌ధూవ‌రుల పేర్ల ప‌క్క‌న సాధార‌ణంగా వారి విద్యార్హ‌త‌లు రాసుకొస్తారు. ఇక్క‌డ మాత్రం క‌రోనా నెగెటివ్ అని రాశారు.
             
ఫోన్లో 1-జీబీ డేటా ఉంచుకుని పెండ్లిసూసి ఆన్‌లైన్‌లో ఆశీర్వదించగలరు అని పేర్కొన్నాడు. లైవ్‌లో తల్వాలు పడ్డంక ఎవ్వరింట్ల ఆళ్లు బువ్వు తినుర్రి అని చెప్పాడు. పెళ్లి త‌ర్వాత‌ బరాత్‌ ఉంది కానీ ఎవరింట్ల వాళ్లు పాటలు పెట్టుకొని ఎగురాల‌ని పేర్కొన్నాడు. ఆ వీడియోల‌ను పంపాల‌ని, తాము త‌మ యూట్యూబ్ చానెల్‌లో పెడ‌తామ‌ని చెప్పాడు. కట్నాలు, కానుకలు గూగుల్‌ పే లేదా ఫోన్‌ పే ద్వారా క్యూఆర్‌ స్కాన్‌ చేసి పంపాల‌ని  పేర్కొన్నాడు.