సొంత ఓటీటీ ఆలోచనలో నాగ్!

30-04-2021 Fri 10:53
  • కొత్తదనానికి ప్రాధాన్యతనిచ్చే నాగ్
  • నిర్మాతగా సినిమాలు - సీరియల్స్
  • కొత్త ఆలోచనపై కసరత్తు  

Nagarjuna Planning for own OTT

నాగార్జునకు ముందుచూపు ఎక్కువనే విషయం ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. ఇక కొత్తదనం విషయంలో ఆయన వెనుకంజ వేయరు. ఒక వైపున హీరోగా వరుస సినిమాలు చేస్తూనే, మరో వైపున నిర్మాతగాను ఆయన తన పనులను చక్కబెడుతున్నారు. 'అన్నపూర్ణ స్టూడియోస్' బ్యానర్ పై సినిమాలు చేస్తూనే, సీరియల్స్ కి కూడ తెరతీశారు. ఈ బ్యానర్ పై భారీస్థాయిలో ధారావాహికలు ప్రేక్షకులను పలకరిస్తున్న సంగతి తెలిసిందే. అలాంటి నాగార్జున సొంత ఓటీటీని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నారనే టాక్ ఒకటి వినిపిస్తోంది.

ఈ మధ్య కాలంలో ఓటీటీల జోరు సాగుతోంది. అరచేతిలో వినోద ప్రపంచాన్ని ఆవిష్కరించడానికి ఓటీటీ సంస్థలు పోటీలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలుగులో డిజిటల్ ఫ్లాట్ ఫామ్ గా అల్లు అరవింద్ 'ఆహా'ను తీసుకొచ్చారు. ఇటీవల కాలంలో 'ఆహా' పుంజుకుంది. సినిమాలు .. వెబ్ సిరీస్ లు మాత్రమే కాకుండా, కొత్త ప్రోగ్రామ్స్ తో ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో ఒక సొంత ఓటీటీని ఏర్పాటు చేయడం కోసం, నాగార్జున తన స్నేహితులతో కలిసి ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. నాగ్ తలచుకుంటే ఆయనకి ఇది పెద్ద విషయం కాదు .. కానీ ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి.