'ఆహా'లో పాయల్ అందమైన విలనిజం?

30-04-2021 Fri 10:24
  • యూత్ లో పాయల్ కి విపరీతమైన క్రేజ్
  • ఆశించిన స్థాయిలో అందని అవకాశాలు
  • వెబ్ సిరీస్ ల దిశగా అడుగులు

 Payal negative role in Three Roses web series

వెండితెరకి భారీ అందాలను పరిచయం చేసిన కథానాయికలలో పాయల్ రాజ్ పుత్ ఒకరు. ఈ సొగసరి మంచి పొడగరి .. అది ఆమెకి ప్రత్యేకమైన ఆకర్షణగా మారింది. మోడరన్ డ్రెస్ లో అయినా .. చీరకట్టులో అయినా ఈ సుందరి కుర్రాళ్ల మతులు పోగొడుతూ ఉంటుంది. కావలసిన అందాలు .. కాస్త అటూ ఇటుగా అనిపించే అభినయంతో తన కెరియర్ ను కొనసాగిస్తోంది. అయితే ఇండస్ట్రీలో రాణించాలంటే లక్కూ, లౌక్యం రెండూ కావాలి. లేదంటే కాస్త వెనకబడక తప్పదు. ఈ పిల్ల విషయంలో అదే జరిగింది.

తెలుగులో పాయల్ ఆశించిన స్థాయిలో అవకాశాలను అందుకోలేకపోతోంది. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాల్లో ఎంట్రీ కొట్టలేకపోతోంది. ఇదే ఇప్పుడు ఆమె అభిమానులను బాధపెడుతున్న విషయం. సినిమాల సంగతి అటుంచితే తాజాగా ఆమె ఒక వెబ్ సిరీస్ ను అంగీకరించింది. ప్రముఖ ఓటీటీ సంస్థ 'ఆహా' వారు 'త్రీ రోజెస్' అనే వెబ్ సిరీస్ ను నిర్మిస్తున్నారు. ఇందులో ఆమె నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రలో చేస్తోందట. ఆమె విలనిజమే ఈ సిరీస్ కి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఈ సిరీస్ జనంలోకి వెళితే .. ఇక పాయల్ ఈ ట్రాకులో బిజీ అవుతుందేమో.