శివం మావి బౌలింగ్‌లో పృథ్వీ షా ఆరు ఫోర్లు.. మ్యాచ్ ముగిశాక మావి ప్రతీకారం!

30-04-2021 Fri 09:55
  • నా బౌలింగులోనే ఫోర్లు కొడతావా అంటూ పృథ్వీ షా మెడ పట్టుకున్న మావి
  • వైరల్ అవుతున్న వీడియో
  • మ్యాచ్ ముగిసింది.. ఫ్రెండ్‌షిప్ మొదలైందన్న ఐపీఎల్
Shivam mavi takes revenge on prithvi shaw

ఐపీఎల్‌లో భాగంగా గతరాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్ జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ జట్టు ఓపెనర్ పృథ్వీషా చెలరేగి ఆడాడు. 41 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 82 పరుగులు పిండుకున్నాడు. కోల్‌కతా బౌలర్ శివమ్ మావి వేసిన ఓవర్‌లో వరుసగా ఆరు ఫోర్లు కొట్టి తన ఉద్దేశాన్ని చాటాడు. ఐపీఎల్‌లో ఒక ఓవర్‌లో ఆరు ఫోర్లు కొట్టడం ఇది రెండోసారి మాత్రమే.  గతంలో అజింక్య రహానే ఈ ఘనత సాధించాడు.

మ్యాచ్ ముగిసిన తర్వాత పృథ్వీ షా వద్దకు వచ్చిన శివమ్ మావి తన బంతులను బౌండరీలకు తరలించినందుకు ప్రతీకారం తీర్చుకున్నాడు. సరదాగా అతడి మెడను అదిమిపట్టుకున్నాడు. ఈ వీడియోను ఐపీఎల్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. ‘‘మ్యాచ్ ముగిసింది.. ఫ్రెండ్‌షిప్ మొదలైంది. ఐపీఎల్ గొప్పతనం ఇదే’’ అని క్యాప్షన్ తగిలించింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.