Corona Virus: తెలంగాణలో కరోనా కేసుల అప్‌డేట్స్!

- కొత్తగా 7,646 మందికి కరోనా
- మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,35,606
- మృతుల సంఖ్య 2,261
- జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 1,441 మందికి కరోనా
తెలంగాణలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. మొన్న రాత్రి 8 గంటల నుంచి నిన్న రాత్రి 8 గంటల మధ్య 7,646 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం... ఒక్కరోజులో కరోనాతో 53 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 5,926 మంది కోలుకున్నారు.
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,35,606 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,55,618 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 2,261గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 77,727 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 1,441 మందికి కరోనా సోకింది.