ప్రముఖ దక్షిణాది దర్శకుడు కేవీ ఆనంద్ కన్నుమూత!

30-04-2021 Fri 08:33
  • కోలీవుడ్ కు దిగ్భ్రాంతిని కలిగించిన ఆనంద్ మరణం
  • ఈ తెల్లవారుజామున గుండెపోటుతో మృతి
  • పలు హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆనంద్
Kollywood Top Director KV Anand Passes Away

ప్రముఖ తమిళ దర్శకుడు, తన చిత్రాల డబ్బింగ్ వర్షన్లతో దక్షిణాదికి సుపరిచితుడైన కేవీ ఆనంద్ ఈ తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మృతి కోలీవుడ్ కు దిగ్భ్రాంతిని కలిగించింది. సూపర్ హిట్ చిత్రాలు ప్రేమదేశం, ఒకే ఒక్కడు, శివాజీ తదితర చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన ఆయన, ఆపై కణా కండేన్ చిత్రంతో దర్శకుడిగా మారారు. ఆపై సూర్యతో అయాన్ (తెలుగులో వీడొక్కడే) చిత్రానికి దర్శకత్వం వహించి, డైరెక్టర్ గా మారారు. ఆపై జీవా హీరోగా కో (తెలుగులో రంగం)తో ఆయన సత్తా ప్రేక్షకులకు తెలిసింది.

తరువాత మాట్రాన్ (తెలుగులో బ్రదర్స్), ఆనేగన్ (తెలుగులో అనేకుడు, కాప్పాన్ (బందోబస్త్) సినిమాలకు దర్శకత్వం వహించారు. మద్రాస్ లో పుట్టిన ఆయన, ప్రీ లాన్స్ ఫోటో జర్నలిస్ట్ గా కెరీర్‌ ను స్టార్ట్ చేసిన ఆయన, ఇండియా టుడే సహా పలు పత్రికల్లో పని చేశారు. ఆపై పీసీ శ్రీరామ్ శిష్యుడిగా మారి పలు సినిమాలకు సినిమాటోగ్రఫీని అందించి, ఆపై దర్శకుడిగా మారారు. ఆయన మరణం కోలీవుడ్ కు తీరని లోటని పలువురు వ్యాఖ్యానించారు.