ముంబయిలో మూడు రోజుల పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిపివేత!
- రిజిస్ట్రేషన్లు కూడా బంద్
- ప్రకటించిన బీఎంసీ అధికార వర్గాలు
- టీకాల కొరతే కారణం
- అందుబాటులోకి రాగానే తెలియజేస్తామని వెల్లడి
- మూడో విడత వ్యాక్సినేషన్‌పైనా నీలినీడలు
ముంబయిలోని బీకేజీ వ్యాక్సినేషన్ కేంద్ర వద్ద గురువారం భారీ స్థాయిలో ప్రజలు టీకా కోసం వరుసల్లో నిలబడ్డారు. ఉదయం 8:30 గంటల వరకు అసలు టీకా చేరకపోవడంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది. చివరకు 9 గంటల సమయంలో ఐదు వేల డోసులు రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద భౌతిక దూరం పాటించడం లేదని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఈ వారం ఆరంభంలో మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ తోపే మాట్లాడుతూ.. కేంద్రం ప్రకటించినట్లుగా మే 1 నుంచి మూడో విడత వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించడం కష్టతరమని తెలిపారు. సరిపడా వ్యాక్సిన్లు లేవని ఆందోళన వ్యక్తం చేశారు.