కరోనా ఎఫెక్ట్... కుటుంబం కోసం ఐపీఎల్ నుంచి తప్పుకున్న అంపైర్
- భారత్ లో కరోనా కల్లోలం
- ఐపీఎల్ పైనా కరోనా ప్రభావం
- ఇప్పటికే పలువురు ఆటగాళ్లు తప్పుకున్న వైనం
- అదే బాటలో అంపైర్ నితిన్ మీనన్
- నితిన్ మీనన్ తల్లి, భార్యకు కరోనా పాజిటివ్
భారత్ లో జరిగే సిరీస్ లతో పాటు ఐపీఎల్ లోనూ విధులు నిర్వర్తించే నితిన్ మీనన్ తన కుటుంబ సభ్యుల కోసం టోర్నీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. నితిన్ మీనన్ తల్లి, భార్య ఇద్దరూ కరోనా బారినపడ్డారు. వారికి పాజిటివ్ రావడంతో, ఈ కష్ట సమయంలో తాను కుటుంబం చెంతన ఉండాలని అంపైర్ నితిన్ మీనన్ నిర్ణయించుకున్నాడు. అందుకే ఐపీఎల్ బయో బబుల్ నుంచి వైదొలగుతున్నట్టు వెల్లడించాడు. ప్రస్తుతం తాను ఆసుపత్రి వద్ద తన కుటుంబ సభ్యుల బాగోగులు చూసుకుంటున్నానని తెలిపాడు.