ఈ విజయం ఎలా వచ్చిందో అర్థం కాలేదు... పిచ్ మారిపోయిందన్న ధోనీ!

29-04-2021 Thu 12:30
  • బుధవారం నాడు సన్ రైజర్స్, సీఎస్కే మధ్య మ్యాచ్
  • సునాయాసంగా విజయం సాధించిన ధోనీ సేన
  • ఈ వికెట్ ఆశ్చర్య పరిచిందన్న ధోనీ
Dhoni Comments After Win Over SRH

బుధవారం న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సునాయాసంగా విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేయగా, ధోనీ నేతృత్వంలోని చెన్నై జట్టు మరో 9 బంతులు మిగిలుండగానే 173 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది.

మ్యాచ్ అనంతరం మాట్లాడిన ధోనీ, ఈ విజయం ఇంత సులువుగా ఎలా వచ్చిందో తనకు అర్థం కాలేదని, తమ బ్యాటింగ్ అద్భుతంగా ఉండటంతో పాటు, పిచ్ మారిపోవడమే కారణమని భావిస్తున్నానని అన్నారు. ఢిల్లీలో తయారు చేసిన వికెట్ తనను ఎంతగానో అశ్చర్యపరిచిందని, ఇటువంటి వికెట్ లభిస్తుందని ఊహించలేదని అన్నాడు. ఇక్కడ మంచు లేదని, మంచు కురిసివుంటే 170కి పైగా పరుగుల ఛేదన కష్టమయ్యేదని అభిప్రాయపడ్డాడు. ఇదే సమయంలో తమ ఓపెనింగ్ భాగస్వామ్యం ఎక్కువగా ఉండటంతో, ఆపై లక్ష్యం ఏ ఓవర్ లోనూ కష్టంగా అనిపించలేదని పేర్కొన్నారు.