సీఐడీ విచారణకు హాజరైన దేవినేని ఉమ.. సీఐడీ కార్యాలయం వద్ద భారీ భద్రత!
- మంగళగిరి సీఐడీ ప్రధాన కార్యాలయానికి వచ్చిన దేవినేని ఉమ
- హైకోర్టు మీద గౌరవంతో విచారణకు వచ్చానని వ్యాఖ్య
- జగన్ వీడియోను మార్ఫింగ్ చేశారంటూ ఉమపై సీఐడీ కేసు
ముఖ్యమంత్రి జగన్ మాటలను మార్ఫింగ్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారనే ఆరోపణలతో దేవినేని ఉమపై సీఐడీ కేసు నమోదు చేసింది. మరోవైపు, ఈ కేసును సవాల్ చేస్తూ హైకోర్టులో ఆయన క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు... సీఐడీ విచారణకు హాజరు కావాలని ఉమను ఆదేశించింది. ఇదే సమయంలో ఆయనను అరెస్ట్ చేయకూడదని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.