Karnataka: మేమింతే ఇస్తాం.. బతకలేకపోతే చావండి: కర్ణాటక మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

  • ఐదు కిలోల బియ్యాన్ని రెండు కిలోలకు తగ్గించి గోధుమలు, జొన్నలు జోడించిన ప్రభుత్వం
  • లాక్‌డౌన్ నేపథ్యంలో ఐదు కిలోల బియ్యం ఇవ్వాలంటూ రైతుల ఆందోళన
  • మేం ఇవ్వలేం.. చస్తే చావండన్న మంత్రి
Karnataka Minister Asks Farmer To Go Die Then A Bizarre Defence

ప్రజలకు ఉచితంగా ఇవ్వాల్సిన ఐదు కిలోల బియ్యం స్థానంలో కర్ణాటక ప్రభుత్వం గోధుమలు, జొన్నలు జోడించి బియ్యాన్ని రెండు కిలోలకు తగ్గించింది. ప్రస్తుతం అక్కడ లాక్‌డౌన్ అమల్లో ఉండడంతో రెండు కిలోల బియ్యం ఎటూ సరిపోవని, మునుపటిలానే ఐదు కేజీల బియ్యం ఇవ్వాలని గదగ జిల్లాలో రైతులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఆందోళనకారుల్లో ఒకరైన ఈశ్వర ఆర్య నిన్న ఆహార, పౌరసరపరాల మంత్రి ఉమేశ్ కత్తికి ఫోన్ చేసి తమ గోడు వినిపించారు.

రెండు కిలోల బియ్యం తమకు ఏమాత్రం సరిపోవని, ఐదు కిలోలు ఇవ్వకుంటే తాము బతకలేమని చెప్పారు. దీనికి మంత్రి స్పందిస్తూ.. ‘‘బతకలేకపోతే చావండి.. అదే మంచిది. మేం మాత్రం అంతే ఇస్తాం’’ అని దురుసుగా సమాధానం ఇచ్చారు. ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో స్పందించిన మంత్రి తాను అలా మాట్లాడిన మాట వాస్తవమేనని అంగీకరిస్తూ క్షమాపణలు చెప్పారు.

More Telugu News