India: భారత్ రకం కరోనా.. 17 దేశాల్లో గుర్తింపు

Indian variant of corona found in 17 countries
  • భారత్‌లో వెలుగు చూసిన వేరియంట్‌ ‘బి.1.617’
  • ఇందులోనూ మూడు ఉప రకాలు
  • జన్యు ఉత్పరివర్తనాల వల్లే పుట్టుకొచ్చాయన్న శాస్త్రవేత్తలు
  • భారత్‌లో కరోనా వ్యాప్తికి ‘బి.1.617’ కారణమంటున్న శాస్త్రవేత్తలు
భారత్‌లో వెలుగు చూసిన కరోనా వైరస్‌లోని కొత్తరకాన్ని ప్రపంచవ్యాప్తంగా 17 దేశాల్లో గుర్తించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ప్రస్తుతం దేశంలో కేసులు విపరీతంగా పెరుగుతుండడానికి కారణం ఇదేనని పేర్కొంది. ఈ కొత్తరకం వైరస్‌ను ‘బి.1.617’గా పిలుస్తున్నారు. ఇందులోనూ పలు ఉప రకాలు ఉన్నాయి. వాటిని ‘బి.1.617.1’, ‘బి.1.617.2’, ‘బి.1.617.3’గా పిలుస్తున్నారు.

జన్యు ఉత్పరివర్తనాల వల్లే అవి పుట్టుకొచ్చినట్టు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వీటిని మన దేశంలో తొలిసారి గతేడాది డిసెంబరులో గుర్తించారు. కాగా, మొన్నటికి ప్రపంచవ్యాప్తంగా 1,200కు పైగా రకాల కరోనా వైరస్‌లను జన్యువిశ్లేషణ ద్వారా గుర్తించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
India
Corona Virus
WHO

More Telugu News