Sri Kalahasti: శ్రీకాళహస్తిపై కరోనా ప్రభావం... రాహు-కేతు పూజలు మినహా అన్నీ ఏకాంతమే!

New Conditions in Sri Kalahasti Temple
  • చిత్తూరు జిల్లాలో పెరుగుతున్న కేసులు
  • రాహు - కేతు పూజలకు మాత్రమే అనుమతి
  • పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తామన్న అధికారులు
నిత్యమూ భక్తులతో కిటకిటలాడే శ్రీకాళహస్తి దేవాలయంపై కరోనా ప్రభావం పడింది. చిత్తూరు జిల్లాలో కేసులు పెరుగుతున్న వేళ, అధికారులు దర్శన వేళల్లో మార్పులతో పాటు, కొత్త ఆంక్షలను విధించారు. ఈ ఉదయం నుంచి శ్రీకాళహస్తి దర్శన వేళల్లో మార్పులు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే భక్తులకు స్వామి దర్శనాలను కల్పిస్తామని తెలిపారు.

ఆలయంలో ప్రత్యేకంగా జరిగే రాహు - కేతు పూజలను మాత్రం అనుమతిస్తామని, మిగతా అన్ని ఆర్జిత సేవలూ ఏకాంతంగానే జరుగుతాయని స్పష్టం చేశారు. పూజలకు కూడా పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తామని, భౌతిక దూరాన్ని పాటిస్తూ, పూజలు చేసుకునే ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.
Sri Kalahasti
Temple
Corona Virus
Chittoor District

More Telugu News