మోదీకి నాయకత్వం తెలీదు, సచిన్ కు బ్యాటింగ్ తెలీదు... ఈ ట్రోలర్స్ కే అన్నీ తెలుసు!: కంగనా రనౌత్ వ్యంగ్యం

27-04-2021 Tue 19:54
  • మోదీ రాజీనామా చేయాలంటూ ఒక వర్గం నెటిజన్ల డిమాండ్
  • ఘాటుగా స్పందించిన కంగనా రనౌత్
  • ట్రోలర్స్ లో ఒకరిని ప్రధానిని చేయండని ఎద్దేవా
Sachin does not know batting says Kangana Ranaut

భారత ప్రధాని నరేంద్ర మోదీ రాజీనామా చేయాలనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది. సెకండ్ వేవ్ లో కరోనా భారీగా విస్తరించడానికి మోదీనే కారణమంటూ కొందరు నెటిజన్లు విమర్శిస్తున్నారు. దీనికి బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ట్రోల్స్ చేస్తున్న వారిపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఘాటుగా స్పందించారు.

నాయకత్వం ఎలా వహించాలో మోదీకి తెలియదు, బ్యాటింగ్ ఎలా చేయాలో సచిన్ టెండూల్కర్ కి తెలీదు, ఎలా నటించాలో కంగనకు తెలియదు, ఎలా పాడాలో లతా మంగేష్కర్ కు తెలీదు.. కానీ, ఈ ట్రోలర్స్ కి మాత్రం బాగా తెలుసని ఎద్దేవా చేశారు. ఈ ట్రోలర్స్ లో ఒకరిని ప్రధానిని చేయండని మండిపడ్డారు.