Narmadaben: ప్రధాని మోదీ బంధువర్గంలో విషాదం... కరోనాతో పినతల్లి మృతి

PM Narendra Modi aunt Narmadaben dies of corona in Ahmedabad
  • నర్మదాబెన్ కు కరోనా పాజిటివ్
  • అహ్మదాబాద్ ఆసుపత్రిలో చికిత్స
  • క్షీణించిన ఆరోగ్యం
  • నేడు ఆసుపత్రిలోనే కన్నుమూత
ప్రధాని నరేంద్ర మోదీ బంధువర్గంలో విషాదం చోటుచేసుకుంది. మోదీ పినతల్లి నర్మదాబెన్ గుజరాత్ లో కరోనాతో కన్నుమూశారు. ఆమె వయసు 80 సంవత్సరాలు. నర్మదాబెన్... మోదీ తండ్రి దామోదరదాస్ సోదరుడు జగ్జీవన్ దాస్ అర్ధాంగి. ఇటీవలే కరోనా బారినపడిన ఆమె అహ్మదాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు మరణించారు. నర్మదాబెన్ న్యూ రాణిప్ ప్రాంతంలో నివసిస్తున్నారు.

దీనిపై మోదీ తమ్ముడు ప్రహ్లాద్ స్పందిస్తూ... తమ పిన్నమ్మ పది రోజుల కిందట అహ్మదాబాద్ ఆసుపత్రిలో చేరిందని వెల్లడించారు. కరోనా వైరస్ కారణంగా ఆమె ఆరోగ్యం బాగా క్షీణించిందని తెలిపారు. ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిందని చెప్పారు. నర్మదాబెన్ భర్త జగ్జీవన్ దాస్ చాన్నాళ్ల క్రితమే మరణించారని ప్రహ్లాద్ మోదీ పేర్కొన్నారు.
Narmadaben
Corona
Demise
Narendra Modi
Ahmedabad
India

More Telugu News