మదనపల్లె జంట హత్యల కేసులో నిందితులకు బెయిల్!
- మూఢ నమ్మకాలతో కన్నకూతుర్లను హతమార్చిన దంపతులు
- జనవరి 24న జరిగిన జంట హత్యలు
- కేసు నమోదై 90 రోజులు పూర్తి కావడంతో బెయిల్ మంజూరు
ఈ దంపతులిద్దరూ మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. వీరికి తొలుత తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో, ఆ తర్వాత విశాఖలోని మానసిక వైద్యశాలలో చికిత్స అందించారు. అనంతరం మదనపల్లె సబ్ జైలుకు తరలించారు. వీరిపై కేసు నమోదై 90 రోజులు పూర్తి కావడంతో.. కోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.
మరోవైపు, హత్యకు పాల్పడిన ఇద్దరూ ఉన్నత విద్యలను అభ్యసించి, ఉన్నతోద్యోగాలను చేస్తున్నవారే కావడం గమనార్హం.